- కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్ టౌన్, వెలుగు: క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జడ్పీ మైదానంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కప్ ద్వారా ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు క్రీడా గొప్ప వేదిక కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల శాఖ అధికారి సీతారాం నాయక్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, నాగేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు.
రోడ్ సేఫ్టీ అవగాహన ర్యాలీ
పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి తో కలిసి బైక్ ర్యాలీలో హెల్మెట్ ధరించి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అజాగ్రత్తతో వాహనాలు నడపడంతో ప్రతిరోజు దేశవ్యాప్తంగా 3500 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తెలిపారు. యువత రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు.
భూసేకరణ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ మీటింగ్ నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల చివరి విడత భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా అని తీవ్రంగా హెచ్చరించారు. జిల్లాలోని తాడూరు, బిజినేపల్లి, వె ల్దండ, కల్వకుర్తి, తిమ్మాజిపేట, ఊర్కొండ వంగూరు మండలాల్లో సేకరిస్తున్న భూసేక రణపై రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో చర్చించారు.
ఇప్పటికే జిల్లాలో నిర్మాణ దశలో జరుగుతున్న ఎత్తిపోతల పథకాలకు కావాల్సిన భూసేకరణ పనులను పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం లో భాగంగా ఇంకా సేకరించాల్సిన భూమి ఎంత ఉందో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
