Love Me Twitter Review: లవ్ మీ మూవీ ట్విట్టర్ రివ్యూ.. దెయ్యంతో ప్రేమ కథ ఎలా ఉందంటే?

Love Me Twitter Review: లవ్ మీ మూవీ ట్విట్టర్ రివ్యూ.. దెయ్యంతో ప్రేమ కథ ఎలా ఉందంటే?

రౌడీ బాయ్స్ ఆశిష్(Ashish), బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ లవ్ మీ(Love Me). ఘోస్ట్ లవ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు(Dil Raju) నిర్మించగా.. కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు(Arun Bhimavarapu) తెరకెక్కించాడు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి, నేషనల్ అవార్డు విన్నర్ పీసీ శ్రీరామ్ లాంటి దిగ్గజాలు పనిచేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా టీజర్ ట్రైలర్ కూడా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు(మే 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల లవ్ మీ మూవీ ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. మరి లవ్ మీ సినిమాకు ఆడియన్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో లవ్ మీ సినిమాకు మిక్సుడ్ టాక్ వస్తోంది. సినిమా చూసిన కొంతమంది బాగుంది అంటుంటే.. కొంతమంది కాన్సెప్ట్ బాగుంది కానీ ప్రెజెంటేషన్ అస్సలు బాగాలేదని చెప్తున్నారు. అందులో ఒక నెటిజన్స్ కామెంట్ చేస్తూ.. లవ్ మీ సినిమాలో విజువల్స్ బావున్నాయి. కానీ, కన్విక్షన్ మిస్ అయ్యింది. క్యారెక్టర్స్ పరంగా బాగానే ఉన్నా.. సరిగా డెవలప్ చెయ్యలేదన్నాడు. ఇలాంటి కథలు వినటానికి బాగున్నా స్క్రీన్ మీదకు వచ్చేసరికి ఆకట్టుకోవు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్.. అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక మరొకరేమో.. లవ్ మీ ఒక సిల్లీ ఘోస్ట్ లవ్ స్టోరీ అని, ఐడియా ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నా.. ఎగ్జిక్యూషన్ బ్యాడ్ అన్నాడు. సస్పెన్స్ క్రియేట్ చెయ్యడంలో దర్శకుడు తడబడ్డాడని, స్క్రీన్ ప్లే కన్ఫ్యూజ్ చేసిందని, అంతకు మించి చెప్పుకోవడానికి సినిమాలో ఏమీ లేదని కామెంట్ చేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే.. లవ్ మీ సినిమాలో లాజిక్ మిస్ అయ్యిందని చెప్తున్నారు సోషల్ మీడియా నెటిజన్స్. మరి ఓవర్ ఆల్ గా ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తోంది అనేది తెలియాలంటే మార్నింగ్ షో అయ్యేవరకు ఆగాల్సిందే.