మల్లారెడ్డి కాలేజీలో లవ్ యువర్ ఫాదర్ మూవీ ప్రారంభం

మల్లారెడ్డి కాలేజీలో లవ్ యువర్ ఫాదర్ మూవీ ప్రారంభం

శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు నిర్మించిన మనీషా ఆర్ట్స్ సంస్థ.. కొన్నేళ్ల తర్వాత అన్నపరెడ్డి స్టూడియోస్‌‌తో కలిసి నిర్మిస్తున్న  చిత్రం ‘లవ్ యువర్ ఫాదర్’.  శ్రీ హర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.  సింగర్ ఎస్పీ చరణ్ ఇందులో తండ్రి పాత్రలో కనిపించనున్నారు. సోమవారం మల్లారెడ్డి కాలేజీలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహేష్ రాఠీ మాట్లాడుతూ ‘మనీషా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌లో కొంత గ్యాప్ తర్వాత నిర్మిస్తున్న చిత్రమిది. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్‌‌ను, బాండింగ్‌‌ని చూపించేలా ఉంటుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు’ అని చెప్పారు. మంచి కాన్సెప్ట్‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు పవన్ చెప్పాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.