మిస్టరీ లవర్ ను.. బామ్మ పట్టించింది!

మిస్టరీ లవర్ ను..  బామ్మ పట్టించింది!

సప్త సముద్రాల అవతల ఉన్న మనుషుల్ని ఒక్కటి చేసే శక్తి సోషల్ మీడియాకి ఉంది. అలాంటిది ఆఫ్ట్రా ల్‌‌ ఒకే ఊళ్లో ఉంటున్నవాళ్లను కలపలేదా?. అయితే.. ఈ స్టో రీలో ఓ అమ్మాయి ఒక అబ్బాయి కోసం అన్వేషణ సాగించింది. ఫేస్‌ బుక్‌ లో అతని గురిం చి పోస్ట్‌‌ పెట్టడం, అది ఆ అబ్బాయి దాకా చేరడం, ఆ అమ్మాయి ప్రేమను అంగీకరిం చడం.. ఒకదాని వెనుక ఒకటి చకచకా జరిగిపోయాయి. ఈ ట్వంటీ ఫస్ట్‌‌ లవ్‌ స్టోరీ వైరల్‌‌ కావడంతో పాటు ఇంగ్లీష్‌ మీడియా చానెళ్లలో ఓ వార్తగా మారిపోయింది కూడా

నార్త్‌‌‌‌ కరోలినా, రాలెగ్‌ సిటీలో మెడికల్‌ రెప్‌ గా పనిచేస్తోంది సవన్నా క్యాంప్‌ బెల్‌. ఇరవై నాలుగేళ్ల క్యాంప్‌ బెల్‌ యానిమల్‌ లవర్‌‌ కూడా. కాళ్లులేని ఓ కుక్కను ఆమె పెంచుకుంటోంది. అది తినడానికి ప్రత్యేకంగా గిన్నె కొనేందుకు గత ఆదివారం(జూన్‌ 9వ తేదీ) ఒక పెట్‌ షాప్‌ కి వెళ్లింది. అక్కడ ఒక కుక్కపిల్లతో కనిపించాడు డేనియల్‌ వేన్స్. ముందు ఆ కుక్కపిల్లకు.. ఆ తర్వాత దాని యజమానికి ఫిదా అయ్యింది సవన్నా. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు కూడా. కానీ, ఆ సంభాషణలో ఎక్కడా అతని పేరుగానీ, వివరాలుగానీ అడగలేదు సవన్నా. కాసేపటికి డేనియల్ తన ఫ్రెండ్‌ తో వెళ్లిపోయాడు. అయితే అతగాడి రూపం మాత్రం ఆమెను బాగా ఇంప్రెస్‌ చేసింది. ఆ విషయాన్ని ఫ్రెండ్‌ తో చెప్పి అతని ఆచూకీ కోసం ప్రయత్నించిం ది. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది.

బామ్మ ట్యాగ్‌ చేసింది

ఆ మరుసటి బిజినెస్‌ ట్రిప్‌ కోసం వేరే ఊరికి వెళ్లిన సవన్నా ‘రాలెగ్‌ కమ్యూనిటీ’ ఫేస్‌ బుక్‌ పేజీలో ఒక పోస్ట్‌‌ చేసింది. ‘సిగ్గువిడిచి చెబుతున్నా ’.. అంటూ మొదలుపెట్టి ఫేస్‌ బుక్‌ లో ఆ మిస్టరీ బాయ్‌ ఫ్రెండ్‌ గురించి ఒక పోస్ట్ చేసింది. అయితే పనిలో పనిగా డేనియల్‌ తో పాటు ఉన్న అతని ఫ్రెండ్‌ ఆనవాళ్లను ఆమె పేర్కొంది. అదే ఆమె ప్రయత్నం సక్సెస్‌ కావడానికి కారణమైంది. సవన్నా చేసిన ఫేస్‌ బుక్‌ పోస్ట్‌‌ ఆ పేజీ ద్వారా బాగా షేర్‌‌ అయ్యింది. అది అటు తిరిగి ఇటు తిరిగి డేనియల్‌ ఫ్రెండ్ బామ్మ దాకా వెళ్లింది. ఆమె ఆ పోస్ట్‌‌లో ఉన్న స్నేహితుడు తన మనవడే అని గుర్తించి.. అతనికి విషయం చెప్పింది. అతను డేనియల్‌ కి ఆ పోస్ట్‌‌ని చేరవేశాడు. అంతే.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా డేనియల్‌ , సవన్నాకి ఫోన్ ద్వారా కాంటాక్ట్‌‌ అయ్యాడు. ఇద్దరూ కలిసి ఫస్ట్‌‌ డేట్‌ కోసం ఎదురు చూశారు. వీళ్ల లవ్‌ స్టోరీ గురించి తెలిసిన ఒక హోటల్‌ ‘స్పెషల్ డిన్నర్‌‌’ కూపన్స్ ఇచ్చింది. ఒక వ్యక్తి ఈ జంట హనీమూన్‌ కోసమని ఏకంగా విరాళాలు సేకరించాడు. బాయ్‌ ఫ్రెండ్‌ ను వెతకడంలో సాయం చేసిన రాలెగ్ కమ్యూనిటీ ప్రజలకు, ముఖ్యంగా ఫ్రెండ్‌ బామ్మకు థ్యాంక్స్ చెబుతోంది సవన్నా.