ముంబై: మహారాష్ట్ర శాంతాక్రూజ్ ఈస్ట్ ఏరియాలోని కలీనాలో దారుణం జరిగింది. ఓ యువతి న్యూఇయర్ వేడుకలు జరుపుకుందామని ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని అతని ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసేసింది. వివరాల్లోకి వెళితే.. 25 ఏండ్ల యువతి, 42 ఏండ్ల వ్యక్తి ఏడేండ్లుగా లవ్ చేసుకుంటున్నారు. తనను పెండ్లి చేసుకోవాలని యువతి చాలా రోజులుగా ఒత్తిడి చేస్తోంది.
కానీ, ప్రియుడు దాటవేస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకల పేరుతో డిసెంబర్ 31న యువతి తన లవర్ను ఇంటికి పిలిపించుకుంది. గురువారం తెల్లవారుజామున పెండ్లి విషయంలోనే ఇద్దరి మధ్య మళ్లీ గొడవ అయ్యింది.
పెండ్లికి లవర్ ససేమిరా ఒప్పుకోకపోవడంతో యువతి పదునైన ఆయుధం తీసుకుని దాడి చేసింది. అతను కింద పడగానే ప్రైవేటు భాగాలను కోసేసింది. బాధితుడు ఆమె నుంచి తప్పించుకుని సోదరుడికి సమాచారం అందించాడు. అతను ఘటనాస్థలికి చేరుకుని.. బాధితుడిని ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
