
ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లి వివేకానందనగర్ లో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివేకానంద నగర్‌కు చెందిన తాపీ మేస్త్రీ కిరణ్.. అదే ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్ధిని ప్రదీప్తీ ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరువురి కుటంబాల్లో తెలియడంతో ఇద్దరి కులాలు వేరుకావడంతో వీరి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో ఇద్దరూ ఇంట్లోనుంచి పారిపోయి ఆదివారం రాత్రి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెద్దలకు దూరంగా వెళ్లి బ్రతకలేమని భావించిన వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు ఒకే తాడుతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.