LSG vs GT: రాహుల్ స్వార్థపూరిత ఇన్నింగ్స్.. గుజ‌రాత్ ఎదుట ఈజీ టార్గెట్

LSG vs GT: రాహుల్ స్వార్థపూరిత ఇన్నింగ్స్.. గుజ‌రాత్ ఎదుట ఈజీ టార్గెట్

టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నోబ్యాటర్లు తడబడ్డారు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని ఉపయోగించలేకపోయారు.  గుజరాత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోవడం మానేసి.. ఔట్ అవ్వకుండా ఉండటంపై అధిక శ్రద్ధ చూపారు. అదే ఆ జట్టును నిండా కొంపముంచింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్(33; 31 బంతుల్లో 3 ఫోర్లు) ఇన్నింగ్స్ టైటాన్స్‌‌ను బాగా దెబ్బతీసింది.  నిర్ణీత 20 ఓవర్లలోలక్నో 5 వికెట్లు 163 పరుగులు చేసింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన‌ లక్నో సూప‌ర్ జెయింట్స్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. టైటాన్స్ పేస‌ర్ ఉమేశ్ యాద‌వ్ విజృంభ‌ణ‌తో రెండు వికెట్లు కీల‌క కోల్పోయింది. తొలి ఓవ‌ర్లోనే ఫామ్‌లో ఉన్న డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ (6) ఔట‌య్యాడు. ఆపై కాసేప‌టికే దేవ్‌ద‌త్ ప‌డిక్కల్‌(7)ను వెన‌క్కి పంపాడు. ఈ స్పీడ్‌స్టర్ దెబ్బతో ల‌క్నో 18 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్‌(33), మార్కస్ స్టోయినిస్‌(58; 43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు)లు ఆచితూచి ఆడారు. ఆఫ్ఘన్ స్పిన్ ద్వయం నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ లను ఎదుర్కోవడంలో వీరు తెగ ఇబ్బంది పడ్డారు. ఆపై కుదురుకున్నాక బ్యాట్ ఝుళిపించారా..! అంటే అదీ లేదు. వికెట్లు పారేసుకుని పెవిలియన్ బాట పట్టారు.

చివరలో నికోలస్ పూరన్(32; 22 బంతుల్లో 3 సిక్స్ లు), ఆయుష్ బదోని(20; 11 బంతుల్లో 3 ఫోర్లు ) రాణించడంతో లక్నో ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే రెండేసి వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు.