LSG vs PBKS : కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్కు స్వల్ప టార్గెట్

LSG vs PBKS : కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్కు స్వల్ప టార్గెట్

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్స్ కైల్ మేయర్స్ (29, 23 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ కు.. కేఎల్ రాహుల్ (74, 56 బంతుల్లో) కెప్టెన్ ఇన్నింగ్స్ తోడవడంతో లక్నో పవర్ ప్లేలో భారీ స్కోరు చేసింది. 

పవర్ల ప్లే తర్వాత కైల్ మేయర్స్ ఓట్ అవ్వడంతో లక్నో బ్యాటింగ్ నెమ్మదించింది. తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్ మెన్ క్రీజులో ఎక్కువ సేపు నిలువలేకపోయారు. మూడో వికెట్లో వచ్చిన దీపక్ హుడా (2, 3 బంతుల్లో) మళ్లీ నిరాశ పరిచాడు. క్రునాల్ పాండ్యా (18, 17 బంతుల్లో) రాహుల్ తో కాసేపు భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. 

ఈ మ్యాచ్ లో లక్నో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలం అయ్యారు. ఆల్ రౌండర్ స్టోయినిస్ (15, 11 బంతుల్లో), గౌతమ్ తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. దాంతో లక్నో 8 వికెట్లు కోల్పోయి159 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3 వికెట్లు పడగొట్టాడు. రబాడాకు 2 వికెట్లు దక్కాయి. అర్ష్ దీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, శిఖందర్ రజా చెరో వికెట్ పడగొట్టారు.