
ఐపీఎల్ 2025 లో భాగంగా గురువారం (మే 22) గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ బ్యాటింగ్ లో విశ్వరూపం చూపించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్(64 బంతుల్లో 117: 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో చెలరేగి ఆడగా.. పూరన్(56), మార్కరం (36) మెరుపులు మెరిపించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్ష్ (117) సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్నో బౌలర్లలో సాయి కిషోర్, అర్షద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జయింట్స్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 9.5 ఓవర్లలోనే 91 పరుగులు జోడించారు. ఇద్దరూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడడంతో పవర్ ప్లే లో 53 పరుగులు రాబట్టింది. పవర్ ప్లే తర్వాత కూడా ఇద్దరూ వేగంగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సాయి కిషోర్ విడగొట్టాడు. మార్కరం 36 పరుగులు చేసి భారీ షాట్ కొట్టి ఔటయ్యాడు. మార్కరం ఔటైనా లక్నో జోరు తగ్గలేదు. మిచెల్ మార్ష్, పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.
33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న మార్ష్.. రషీద్ ఖాన్ వేసిన 12 ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 25 పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 17 ఓవర్ ఐదో బంతికి అర్షద్ బౌలింగ్ లో సింగిల్ కొట్టి మార్ష్ 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో పూరన్ 23 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ఈ జోడీ రెండో వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. చివర్లో పంత్ కూడా రెండు సిక్సర్లు కొట్టడంతో లక్నో 230 పరుగుల మార్క్ అందుకుంది.
That was SENSATIONAL 🥵#GTvLSG live 👉 https://t.co/TT7Eu0r3fM pic.twitter.com/5VIU1K3331
— ESPNcricinfo (@ESPNcricinfo) May 22, 2025