DCvsLSG: దుమ్మురేపిన లక్నో..ఢిల్లీకి భారీ టార్గెట్

DCvsLSG: దుమ్మురేపిన లక్నో..ఢిల్లీకి భారీ టార్గెట్

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ దుమ్ము రేపింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో  లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.  కైల్ మేయర్స్ (38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73 పరుగులు) విధ్వంసం సృష్టించాడు. చివర్లో నికోలస్ పూరన్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు ) రెచ్చిపోయాడు. వీరికి కృనాల్ పాండ్యా (15 పరుగులు నాటౌట్), ఆయుష్ బదోని (18 పరుగులు) చెలరేగడంతో లక్నో  ఢిల్లీకి భారీ టార్గెట్ ను నిర్దేశించింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లకు చెరో వికెట్ దక్కింది.