చంద్రగ్రహణం 2026..  గ్రహణం.. పట్టు స్నానం ఎప్పుడు.. విడుపుస్నానం ఎప్పుడు.. ఏటైంలో  గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది..

చంద్రగ్రహణం 2026..  గ్రహణం.. పట్టు స్నానం ఎప్పుడు.. విడుపుస్నానం ఎప్పుడు.. ఏటైంలో  గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది..

ఫాల్గుణ మాసం .. పౌర్ణమి  రోజు.. మార్చి 3వ తేదీ.. మంగళవారం .. ఈ ఏడాదిలో తొలి చంద్ర గ్రహణం.. విశ్వావశునామ సంవత్సరంలో చివరి గ్రహణం ఏర్పడనుంది. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం...  సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో పాక్షికంగా అంటే చివరి 27 నిమిషాలు కనపడుతుంది. చంద్ర గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం, మధ్య సమయం..  పట్టు విడుపులసమయాల గురించి వివరంగా తెలుసుకుందాం. . .

కేతు గ్రస్త  చంద్రగ్రహణం సింహ రాశిలో పూర్వ ఫల్గుణి ( పుబ్బ) నక్షత్రంలో  సంభవిస్తుందని పండితులు చెబుతున్నారు.ఫాల్గుణమాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున.. మార్చి 3 న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది.  ఈ గ్రహణం మధ్యాహ్నం 3:21 గంటలకు  ప్రారంభమవుతుంది.  గ్రహణ వ్యవధి మొత్తం 3 గంటల 27 నిమిషాలు  ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  

గ్రహణం సూతకాలం ప్రారంభమయ్యే సమయం:  మార్చి 3 ఉదయం 6.22 గంటలకు

 గ్రహణం మొదలయ్యే సమయం ( గ్రహణ స్పర్శకాలం) :   మార్చి 3  మధ్యాహ్నం 3:21 గంటలు

గ్రహణం మధ్యలోకి  వెళ్లే సమయం ప్రారంభం ( ఉన్మీలన కాలం): మార్చి 3 సాయంత్రం 5:02 గంటలకు .. గ్రహణం ప్రభావం తీవ్రతరంకావడం ప్రారంభిస్తుంది. 

గ్రహణ మధ్య కాలం :  మార్చి 3 సాయంత్రం 5:32 గంటలకు  .. ఈ సమయంలో గ్రహణం ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. 

 గ్రహణం పూర్తిగా పట్టే   సమయం (నిమీలన కాలం)  :మార్చి 3 సాయంత్రం 5:48  గంటలకు  .. ఇప్పటి వరకు గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. 

 గ్రహణం విడవడం ప్రారంభించే సమయం (గ్రహణ మోక్షకాలం) : మార్చి 3 సాయంత్రం 6:12 గంటలు గంటలకు .. గ్రహణ ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది. 

 గ్రహణం  పూర్తిగా ముగిసే సమయం (అద్యంత పుణ్యకాలం).. మార్చి 3 సాయంత్రం 6:48 గంటలకు పూర్తిగా గ్రహణ ప్రభావం తగ్గుతుంది.
 
హైదరాబాద్​ సహా భారతదేశంలో   కనపడే సమయం: మార్చి 3 సాయంత్రం 6:20 గంటల నుంచి సుమారు 27 నిమిషాలు

జపాలు .. అనుష్టానం చేసే వారు గ్రహణం స్పర్శకాలానికి ముందే స్నానం చేసి ఆ సమయానికి ప్రారంభించాలి. తరువాత గ్రహణం పూర్తిగా విడిచేంత వరకు అంటే మార్చి 3 వ తేదీన సాయంత్రం 6.48 గంటల వరకు  జపం చేసి.. గ్రహణం విడుపు స్నానం చేసి.. దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని నువ్వుల నూనెతో  దీపారాధన చేయాలి. ఆ తరువాత శివాలయాన్ని.. నవగ్రహాలను దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.