
ఈ నెల అంటే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు 8న ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేసి ఉంటాయి. 5 గంటల తర్వాత యధావిధిగా ఆలయ ధ్వారాలు తెరుచుకుంటాయి.
సెప్టెంబర్ 7న ఆదివారం స్వామివారి స్పర్శ దర్శనం నిలిపివేయడం తో పాటు పరివార ఆలయాలు మూసివేస్తారు. స్వామివారి ఆర్జిత, పరోక్ష సేవలు, స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం కూడా ఆ రోజు నిలిపివేయనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 వరకు భక్తులందరికీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు.
8న ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేస్తారు. ఆలయంలో ప్రాతఃకాల పూజలు 7:30కు శ్రీస్వామి అమ్మవార్ల మహామంగళ హారతులు, ఆ తర్వాత మధ్యాహ్నం 2:15 వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఉంటుంది. ఆన్ లైనులో స్పర్శదర్శనం బుక్ చేసుకున్న భక్తులకు 8వ తేదీ మధ్యాహ్నం 2.15 నుండి 4 స్పర్శదర్శనం కల్పిస్తారు.