వారెన్ బఫెట్‌‌తో లంచ్.. జస్ట్‌‌ రూ.24 కోట్లే!

వారెన్ బఫెట్‌‌తో లంచ్.. జస్ట్‌‌ రూ.24 కోట్లే!

వాషింగ్టన్ : ఎవరితోనైనా బయటికి వెళ్లి లంచ్ చేస్తే… ఎంతవుతుంది.. మహా అయితే.. ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు బిల్లు కట్టాల్సి వస్తుందేమో. కానీ బిలీనియర్, బెర్క్‌‌షైర్‌‌‌‌ హాత్‌‌వే ఇంక్‌‌ ఛైర్మన్‌‌ వారెన్‌‌ బఫెట్‌‌తో లంచ్ చేయాలంటే ఏకంగా రూ.24 కోట్లవుతుందట. వారెన్ బఫెట్‌‌తో లంచ్ చేయడానికి ప్రతేటా నిర్వహించే ఛారిటీ ఆక్షన్‌‌లో గురువారం రికార్డు స్థాయిలో 3.5 మిలియన్ డాలర్లు పలికింది. అంటే   ఈ మేర ఖర్చు పెట్టి మరీ బఫెట్​తో భోజనం చేయాలనుకుంటున్నారట.  బఫెట్‌‌తో లంచ్ కోసం 25 వేల డాలర్లతో ఆదివారం నుంచి ఆన్‌‌లైన్ ఆక్షన్‌‌ను ఈబే ప్రారంభించింది. సోమవారం గుర్తు తెలియని బిడ్డర్లు రికార్డు స్థాయిలో 3,456,789 డాలర్లకు బిడ్‌‌ వేశారు.  ఈ బిడ్‌‌లో వచ్చిన మనీని శాన్‌‌ఫ్రాన్సిస్కో ఛారిటీ గ్లైడ్ ఫౌండేషన్‌‌కు ఇవ్వనున్నారు.

ఈ ఫౌండేషన్‌‌ పేదలు, సొంత ఇల్లు లేని వారిని ఆదుకుంటుంది. వారెన్ బఫెట్‌‌తో లంచ్ కోసం నిర్వహిస్తోన్న ఆన్‌‌లైన్ ఆక్షన్‌‌కు శుక్రవారమే ఆఖరి తేదీ.  తొలిసారి 2‌‌000లో నిర్వహించిన ఆక్షన్స్‌‌లో 29.6 మిలియన్ డాలర్లను అంటే రూ.206 కోట్లను గ్లైడ్‌‌ ఫౌండేషన్ కోసం బఫెట్ సేకరించారు. బఫెట్ మొదటి భార్య సుసాన్‌‌, గ్లైడ్‌‌ను వారెన్ బఫెట్‌‌కు పరిచయం చేశారు. ఆమె 2004లో మరణించారు. అప్పటి నుంచి బఫెట్‌‌, గ్లైడ్ ఫౌండేషన్‌‌తో భాగస్వామ్య మయ్యారు. ఆన్‌‌లైన్‌‌ ఆక్షన్‌‌లో గెలిచిన బిడ్డర్‌‌‌‌తో పాటు వారికి చెందిన ఏడుగురు స్నేహితుల వరకు బఫెట్‌‌తో కలిసి మన్‌‌హట్టన్‌‌లో స్మిత్ అండ్ వోలెన్స్కీ స్టీక్ హౌజ్‌‌లో లంచ్ చేయొచ్చు. 2010,2011 వేలాల్లో గెలిచిన విన్నర్‌‌‌‌లో ఒకరైన టెడ్ వెస్క్లర్‌‌…‌‌ 5.25 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి బఫెట్‌‌తో లంచ్ చేశారు.

2010లో ఆక్షన్‌‌లో గెలిచిన తర్వాత తొలిసారి బఫెట్‌‌ను వెస్క్లర్ కలిశారు. అయితే వెస్క్లర్‌‌‌‌ అప్పుడు స్మిత్ అండ్ వోలెన్స్కీకి బదులు ఒమహాలో లంచ్ చేశారు.  ప్రస్తుతం ఆయన బెర్క్‌‌షైర్‌‌‌‌ పోర్ట్‌‌ఫోలియో మేనేజర్‌‌‌‌గా పనిచేస్తున్నారు. అయితే ఈ లంచ్‌‌లో పాల్గొనడానికి ఈ ఏడాది ఎంతమంది ఎన్ని మిలియన్ డాలర్లను కుమ్మరిస్తున్నారో చూడాల్సి ఉంది.