హైదరాబాద్, వెలుగు: లగ్జరీ యూరోపియన్ ఫర్నిచర్ బ్రాండ్ ఆల్టెరో హైదరాబాద్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మాదాపూర్‌లో తొలి స్టోర్‌ను కంపెనీ గురువారం ప్రారంభించింది. నాణ్యమైన లగ్జరీ ఫర్నిచర్‌ను సరసమైన ధరల్లో విక్రయిస్తామని ఆల్టెరో ఎండీ చందన ఈ సందర్భంగా తెలిపారు. ధరలు 5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటాయి.
ఇటలీ అరాన్ కుచీనే కిచెన్, వాడ్రోబ్స్, ఆఫీస్ ఫర్నిచర్ ఇక్కడ లభిస్తుంది. జార్జియో కలెక్షన్, ఘీడీని 1961, కాంటోరీ, రోజినీ దివానీ, స్కాప్పినీ హోమ్, మరెల్లి, ప్లస్ట్, మిండో వంటి అంతర్జాతీయంగా పేరొందిన బ్రాండ్‌కు చెందిన లూజ్ ఫర్నిచర్ ఇక్కడ అందుబాటులో ఉంటుందని చందన చెప్పారు.
