
కంటికి కూడా సరిగ్గా కనిపించని బ్యాగ్ రూ. 51 లక్షలు!
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ ఓ హ్యాండ్ బ్యాగ్‌ను రూ. 51 లక్షలకు (63 వేల డాలర్లకు) అమ్మింది. అది సాధారణమే కదా అనుకోవచ్చు. కానీ, ఈ బ్యాగ్ సైజ్ బియ్యపు గింజ కంటే తక్కువ. ఈ బ్యాగ్ వెడల్పు 0.03 ఇంచుల కంటే తక్కువ కావడం విశేషం. మైక్రోస్కోప్ లేకపోతే సరిగ్గా కనిపించని ఈ మైక్రో బ్యాగ్‌ను లూయిస్ వీట్టన్ ఆన్‌లైన్‌లో వేలం వేసింది. ఈ బ్యాగ్‌ను ఒక ఆర్ట్ కలెక్షన్‌గా చూస్తున్నారు.