ఫేమస్‌‌ సింగర్‌‌ బీబర్‌‌కు లైమ్‌‌ వ్యాధి

ఫేమస్‌‌ సింగర్‌‌ బీబర్‌‌కు లైమ్‌‌ వ్యాధి

ఫేమస్‌‌ ‘బేబీ’ సాంగ్‌‌ సింగర్‌‌ జస్టిన్‌‌ బీబర్‌‌కు ‘లైమ్‌‌’ అనే వ్యాధి వచ్చిందట. దానికి ట్రీట్‌‌మెంట్‌‌ కూడా  చేయించుకుంటున్నాడట. ఇదే విషయాన్ని ఆ కెనడియన్‌‌ సింగర్‌‌ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేశారు. ‘ఈమధ్య బీబర్‌‌ పీక్కుపోయినట్టు కనిపిస్తున్నాడని చాలా మంది అంటున్నారు. కానీ వాళ్లకు తెలియదు నాకు లైమ్‌‌ వ్యాధి వచ్చిందని. ట్రీట్‌‌మెంట్‌‌ చేయించుకున్నానని. అంతేకాదు మోనో వ్యాధి కూడా ఇబ్బంది పెట్టింది. నా ఎనర్జీని, నా మెదడు పనితీరును తగ్గించేసింది. నా చర్మాన్ని నాశనం చేసింది. మొత్తంగా నా హెల్త్‌‌నే దెబ్బతీసింది’ అని వివరించారు.

లైమ్‌‌ వ్యాధి బొర్రెలియా బర్గ్ డార్ఫరి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇక్సోడ్స్‌‌ అనే పేను లాంటి పురుగుల (టిక్స్‌‌) ద్వారా వ్యాపిస్తుంది. అమెరికా, యూరప్‌‌, ఉత్తరార్ధగోళంగా ఎండాకాలంలో బాగా వస్తుంటుంది. వ్యాధి సోకితే చర్మంపై ఎర్రగా, గుండ్రంగా దద్దుర్లు ఏర్పడతాయి. వీటితో పాటు కీళ్ల నొప్పులుంటాయి. చేతులు, కాళ్లు వీకైపోతాయి. లేటైందంటే మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది. పక్షవాతం కూడా రావొచ్చు. ఇండియాలో ఈ రోగం చాలా తక్కువ. ఆమధ్య హర్యానా, హిమాచల్‌‌ ప్రదేశ్​లో ఈ వ్యాధి వచ్చినట్టు వార్తలొచ్చాయి.