ఎస్ఎస్ దుశ్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన చిత్రం ‘గత వైభవ’. ఎపిక్ ఫాంటసీ డ్రామాగా సింపుల్ సుని దర్శకత్వం వహిస్తూ దీపక్ తిమ్మప్పతో కలిసి నిర్మిస్తున్నారు. నవంబర్ 14న తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా, ఆదివారం మొదటి పాటను విడుదల చేశారు. జుడా సాండీ కంపోజ్ చేసిన ఈ పాటను కైలాష్ ఖేర్, చేతన్ నాయక్, చిన్మయి కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది.
రాంబాబు గోసాల క్యాచీ లిరిక్స్ రాశాడు. ‘సాగరాన్ని మధించితే పుట్టుకొస్తివా, ప్రేమ కురిపిస్తూ పిలిచిన దైవమే నువ్వా.. కోట్ల మందిని ఆకర్షించు మన్మథుడివా, పెద్ద పులినైనా సంహరించు వేటగాడివా.. హే అందమా చంద్రమా హృదయ రాణీవే.. నీ మనసులో నాకు చోటు ఇవ్వవే..’ అంటూ సాగిన పాటలో దుశ్యంత్, ఆషికా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఓ షిప్‌లో సాగిన ఈ పాట డిఫరెంట్‌గా సాగుతూ సినిమాపై ఆసక్తిని పెంచింది. ప్రస్తుత పరిస్థితులకు మైథలాజిని లింక్ చేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ క్యూరియాసిటీని పెంచింది.
