
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రూపొందుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఓ అందమైన ప్రేమకథగా నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ కాగా, ఆదివారం రెండో పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్.
‘ఏం జరుగుతోంది...’ అంటూ సాగే సెకండ్ సింగిల్‌ను ఆగస్టు 26న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. ఫీల్ గుడ్ లవ్ సాంగ్‌గా ఈ పాట రాబోతోందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.