
ఐపీఎల్ 2025 ఎనిమిది రోజుల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం (మే 17) రాత్రి జరిగే మ్యాచ్‌తో లీగ్ రీస్టార్ట్ అవ్వనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయాలనుకున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఈ కీలక మ్యాచ్ కు భారీ వర్ష సూచన ఉండడమే ఇందుకు కారణం. రిపోర్ట్స్ ప్రకారం బెంగళూరులో శనివారం భారీ వర్షాలు పడడం ఖాయంగా కనిపిస్తుంది. మ్యాచ్ జరిగే సమయంలో 70 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
శనివారం (మే 17) మధ్యాహ్నాం బెంగళూరులో వర్షం పడలేదు. అయితే సాయంత్రానికి భారీ వర్ష సూచన ఉంది. 7 గంటలకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేయబడింది. బెంగళూరులో ప్రస్తుతం 93% మేఘావృతం.. తేమ 54% ఉంది. టాస్ సమయానికి 71 శాతం.. 8 గంటలకు 69 శాతం.. 9 గంటలకు 49 శాతం.. 10 గంటలకు 34 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. బెంగళూరులో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు ఆర్సీబీ ఖాతలో 17 పాయింట్లు ఉంటాయి. మరోవైపు కేకేఆర్ కు 12 పాయింట్లు ఉంటాయి. దీంతో ఆర్సీబీ దాదాపు ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకోగా.. కేకేఆర్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నా.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలన్నా.. ఈ మ్యాచ్ లో గెలవడం ఇరు జట్లకు కీలకం.
►ALSO READ | RCB vs KKR: పటిదార్ ఫిట్.. హేజల్ వుడ్ ఔట్: కోల్‌కతాతో ఆడబోయే RCB ప్లేయింగ్ 11 ఇదే!
ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న పటిదార్ సేనతర్వాత జరగబోయే మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. కనీసం రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లే టాప్-2 లో ఉండే అవకాశం ఉంది. కేకేఆర్ 12 మ్యాచ్ ల్లో 11 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది.