ఢిల్లీ : సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ M.నాగేశ్వరరావు కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు నుంచి శిక్ష పూర్తిచేసుకుని బయటకు వచ్చారు. బిహార్ ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో బదిలీలు చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న అభియోగాలపై నాగేశ్వరరావుకు రూ.1లక్ష రూపాయల ఫైన్ వేసింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు…. రోజంతా కోర్టు హాలులోనే ఓ మూలన కూర్చోవాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నాగేశ్వరరావు కోర్టు హాలులోనే ఉన్నారు. ధర్మాసనం అనుమతి ఇవ్వడంతో… నాగేశ్వరరావు కోర్టు నుంచి బయటకు వచ్చారు.
