కొనసాగుతున్న ‘మా’ ఎన్నికలు

కొనసాగుతున్న ‘మా’ ఎన్నికలు

మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సీనియర్ నటుడు…ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తున్నారు. అదే ప్యానెల్ లో జనరల్ సెక్రెటరీగా పని చేసిన నరేష్… శివాజీ రాజాకు పోటీగా బరిలోకి దిగారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవనుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ లో దాదాపు 8 వందల మంది వరకు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

శివాజీరాజా ప్యానెల్ లో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నాగినీడు, పృథ్వీరాజ్, బెనర్జీ, బ్రహ్మాజీ, యంగ్ హీరోలు తనీష్, రాజ్ తరుణ్ సహా 25 మంది పోటీ చేస్తున్నారు. మరోవైపు నరేశ్ ప్యానెల్ లో జీవిత, రాజశేఖర్, శివ బాలాజీ సహా 26 మంది సభ్యులు బరిలోకి దిగుతున్నారు. అటు వైస్ ప్రెసిడెంట్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నటి హేమా పోటీ చేస్తున్నారు.