అక్టోబర్ 10న 'మా' ఎన్నికలు

V6 Velugu Posted on Aug 25, 2021

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA ) ఎన్నికల తేదీ ఖరారయింది. ఎన్నికలను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. అసోసియేషన్ ఎన్నికల క్రమంలో టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతాని అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. నామినేషన్ల ఆఖరు తేదీ నాటికి ఇంకా ఎవరైనా బరిలోకి దిగుతారా?  అని తెలిసే అవకాశముంది. 

MAA శాశ్వత భవన నిర్మాణమే ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల తేదీ ప్రకటించడంతో..ఇక ప్రచారపర్వం ప్రారంభం కానుంది. అభ్యర్థులు, వారి ప్యానల్స్ సభ్యులు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. 

Tagged Maa Elections, October 10th

Latest Videos

Subscribe Now

More News