
సీనియర్ నటి గీతాంజలి మృతిపై టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కు కోల్పోయిందన్నారు మా అధ్యక్షుడు నరేష్. నటిగానే కాకుండా వ్యక్తిగతంగా ఆమె ఎప్పుడూ అందిరితో కలివిడిగా ఉండేవారన్నారు. అలాంటావిడ ఉన్నట్లుండి ఇలా అందరినీ వదిలేసి వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు. ముఖ్యంగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో అందరికీ ఆమె ఎంతో చేరువగా ఉండేవారన్నారు.. మంచి, చెడుల్లో భాగమైయ్యేవారని.. అలాంటి మంచి మనసున్న వ్యక్తి మనల్ని విడిచిపెట్టిపోవడం బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాన్నామని చెప్పారు నరేష్.