ముంబై: ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను గ్లోబల్ అంశాలు నిర్ణయించనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే యూఎస్ ఫెడ్ పాలసీ మీటింగ్ ఈ నెల 19 న మొదలు కానుంది. 20 న మీటింగ్ వివరాలు బయటకు రానున్నాయి. ఈ ఇంపార్టెంట్ ఈవెంట్‌తో పాటు గ్లోబల్ మారెట్ల ట్రెండ్‌ను, ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ల ఇన్‌ఫ్లోస్‌ను ట్రేడర్లు గమనించాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు కిందటి వారంలో భారీగా పడ్డాయి. ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికర అమ్మకం దారులుగా ఉన్నారు. క్రూడాయిల్ ధరలు పెరగడంతో కూడా మార్కెట్ నెగెటివ్‌లో ట్రేడయ్యింది. షార్ట్ టెర్మ్‌లో మార్కెట్‌లో వోలటాలిటీ కొనసాగుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏడాది, ఐదేళ్ల కాలపరిమితి గల లోన్లపై ప్రైమ్ రేట్‌ను చైనా ఈ నెల 19 న ప్రకటించనుంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా ఇదే రోజున తన వడ్డీ రేట్ల నిర్ణయాన్ని బయటపెట్టనుంది. జపాన్ ఇన్‌ఫ్లేషన్ నెంబర్లు ఈ నెల 22 న వెలువడనున్నాయి. డాలర్ మారకంలో రూపాయి కదలికలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలపై ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. కిందటి వారం సెన్సెక్స్ 1,476 పాయింట్లు (2 శాతం), నిఫ్టీ 470 పాయింట్లు క్రాష్ అయ్యింది.
