కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఉన్న హీరో కార్తి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్‌తోపాటు సరికొత్త స్టిల్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కార్తి హీరోగా ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కొత్త చిత్రం మొదలైంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. సితార సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, తన బర్త్‌డే సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. మరోవైపు కార్తి హీరోగా నటిస్తున్న ‘సర్దార్ 2’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కార్తి లుక్ ఆకట్టుకుంది.
పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్ లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే సినిమా విడుదల కానుంది. అలాగే కార్తి నటిస్తున్న ‘మార్షల్’ చిత్రం నుంచి బర్త్‌డే విషెస్‌తో విడుదలైన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు తమిళ్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
