పిచ్చి ప్రశ్నలు వేయని హోటళ్లే కావాలి

పిచ్చి ప్రశ్నలు వేయని హోటళ్లే కావాలి

ఓ హోటల్​లో రూమ్​ బుక్​ చేసుకోవాలంటే సవాలక్ష ప్రశ్నలు వేస్తుంటారు సిబ్బంది. ఐడెంటిటీ ప్రూఫ్​ అడుగుతుంటారు. చాలా జంటలకు అవన్నీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే, తమకు అనువుగా ఉండే, ప్రైవసీకి అడ్డు తగలని హోటళ్లే కావాలంటున్నాయి జంటలు. నగరాల్లోని నేటి యువతరం ‘కపుల్​ ఫ్రెండ్లీ’ హోటళ్లే కావాలంటోంది. ఒక రోజు లోపు స్టే కోసం ఆ హోటళ్లకే 72 శాతం మంది ఓటేశారు. స్టే కోసం పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయని హోటళ్లకు 80% మంది మొగ్గు చూపారు. ఆన్​లైన్​ ట్రావెల్​ బుకింగ్​ కంపెనీ గోఐబిబో చేసిన సర్వేలో ఈ విషయం తేలింది.

46% బుకింగ్​లు లోకల్​గా ఉండే యువత నుంచే వస్తున్నట్టు సర్వే తేల్చింది. మిగతా 54% వేరే ప్రాంతాల బుకింగ్​లని పేర్కొంది. గత ఏడాది దాదాపు 50% మంది ఐదు కంటే ఎక్కువ సార్లు కపుల్​ ఫ్రెండ్లీ హోటళ్లను బుక్​ చేసినట్టు చెప్పారు. అందులో 33 శాతం మంది చెకిన్​ అయిన రోజే చెకౌట్​ అయ్యారు.  తక్కువ ధరలు ఉండే హోటళ్లకు 61%, లొకేషన్​ను బట్టి 55%, రేటింగ్​ను బట్టి 53%, ప్రైవసీకి తగ్గట్టు 52% మంది, డిస్కౌంట్లు ఎక్కువిచ్చే హోటళ్లు కావాలని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. హోటల్​ సిబ్బంది అనుమానంగా చూడడం చాలా ఇబ్బందిగా ఉందని సర్వేలో పాల్గొన్నవాళ్లు చెప్పారు.

see also: పిల్లి కాదు.. పులి

మరిన్ని వార్తల కోసం