
కోల్‌కతా: జైశ్రీరాం.. అననందుకు కొందరు పశ్చిమబెంగాల్‌లో ఓ మదర్సా టీచర్‌ను నడుస్తున్న రైల్లోంచి తోసేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై దాడి చేశారు. ఈ నెల 19న దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ దారుణం జరిగింది. స్థానికులు మదర్సా టీచర్‌ను హాస్పిటల్‌లో చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ‘‘గత బుధవారం కేనింగ్ స్టేషన్ నుంచి రైళ్లో వెళ్తుండగా కొందరు జైశ్రీరాం అంటూ నా దగ్గరికి వచ్చారు. నినాదాలు చేయాలని తీవ్రంగా కొట్టారు. భయపడి నినాదాలు చేశా. కానీ విన్పించుకోలేదు. తర్వాత వాళ్లు నాతోపాటు మరో ఇద్దరిని రైల్లోంచి తోసేశారు. మొత్తం ఏడుగురిపై దాడి చేశారు’’ అని మదర్సా టీచర్ మన్నన్ ముల్లా చెప్పారు. స్థానికులు పట్టాలపై పడిపోయిన ఆయన్ను హాస్పిటల్‌లో చేర్చారు.