
హీరో రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కొడుకు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సినిమా ‘మారెమ్మ’. రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి మంచాల నాగరాజ్ దర్శకుడు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
గురువారం మాధవ్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌తోపాటు, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మాధవ్ ఇంటెన్స్, రగ్గడ్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. కబడ్డీ కోర్టులో అడుగుపెడుతున్నట్లుగా ప్రజెంట్ చేసిన గ్లింప్స్ పవర్ ఫుల్‌గా ఉంది. దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్.రూప లక్ష్మి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు.