బహిరంగంగా హుక్కా స్మోకింగ్.. నలుగురు యువకులు అరెస్ట్

బహిరంగంగా హుక్కా స్మోకింగ్.. నలుగురు యువకులు అరెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: బహిరంగ ప్రదేశంలో హుక్కా సేవిస్తున్న నలుగురు యువకులపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 7న రాత్రి 8 గంటలకు కార్మిక నగర్ బస్టాండ్ నుంచి ఆటో స్టాండ్ కు వెళ్లే మార్గమధ్యలో మహమ్మద్ ఇర్ఫాన్(26), అబ్దుల్ రెహమాన్(21), అబ్దుల్ సద్దామ్(19), మహమ్మద్ రబ్బాని(20) బహిరంగంగా హుక్కా సేవిస్తున్నారు. 

స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హుక్కా సామగ్రిని సీజ్ చేసి వారిపై కేసు ఫైల్​ చేశారు.  నిందితులను రహమత్ నగర్ డివిజన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.