నేను ఎంపీగా పోటీ చేయను.. మంత్రి వర్గ విస్తరణ రేవంత్ ఇష్టం : మధుయాష్కీ

నేను ఎంపీగా పోటీ చేయను.. మంత్రి వర్గ విస్తరణ రేవంత్ ఇష్టం : మధుయాష్కీ
  • నేను ఎంపీగా పోటీ చేయను
  • మంత్రి వర్గ విస్తరణ రేవంత్ ఇష్టం
  • హైకమాండ్ జోక్యం చేసుకోదు
  • పీసీసీ చీఫ్ రేసులో రెడ్డి లీడర్లు
  • ఆ పదవి బీసీ నేతలకు ఇవ్వరు
  • బీజేపీ స్టేట్ చీఫ్ గా కిషన్ రెడ్డిని మారుస్తరు
  • అందుకే హైదరాబాద్ కు అమిత్ షా 
  • మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్

హైదరాబాద్ : తాను ఎంపీ టికెట్ రేసులో లేనని, నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. 15 లోక్ సభ సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకొన్నామని అన్నారు. ఎల్బీనగర్ లో తనను సొంత పార్టీ లీడర్లే ఓడగొట్టారని చెప్పారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. 

అక్రమాస్తులు కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోకైనా జంప్ అవుతారని చెప్పారు. ఎన్నికల నాటికి ఎల్బీనగర్ లో 30 వేల ఫేక్ ఓట్లు యాడ్ అయ్యాయని చెప్పారు. గ్రేటర్ లో ముస్లింలు, సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్ కే పడ్డాయని అన్నారు.  మంత్రి వర్గ విస్తరణ విషయంలో హైకమాండ్ జోక్యం చేసుకోబోదని, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. పీసీసీ చీఫ్ రేసులో రెడ్డి లీడర్లే ఉన్నారని, బీసీలకు ఆ పదవి ఇస్తారనేది ఊహ మాత్రమేనన్నారు. 

బీజేపీ స్టేట్ చీఫ్ ను మారుస్తరు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డిని మార్చేస్తారని మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే హైదరాబాద్ కు కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చారని చెప్పారు. ఈ విషయాన్ని ఓ కేంద్రమంత్రి తనకు స్వయంగా చెప్పారని అన్నారు.  కిషన్ రెడ్డి పొద్దున లేస్తే జై అసద్ భాయ్ అంటున్నరని అన్నారు.