
నాని, శ్రీనిథి శెట్టి జంటగా నటించిన రీసెంట్ మూవీ ‘హిట్:ది థర్డ్ కేస్’. హిట్ ఫ్రాంచైజీలో శైలేష్ కొలను రూపొందించిన మూడో చిత్రమిది. నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదలై భారీ సక్సెస్ అందుకుంది. ఇపుడీ ఈ మూవీ కాపీరైట్ ఆరోపణలపై చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఈ క్రమంలోనే హిట్3 స్టోరీ కాపీ కొట్టారంటూ స్క్రిప్ట్ రైటర్ విమలవేలన్ అలియాస్ విమల్ ఆరోపించారు. విమల్ పిటిషన్తో మద్రాస్ హై కోర్టు.. హీరో కం నిర్మాత నాని మరియు దర్శకుడు శైలేష్ కొలనుకు నోటీసు జారీ చేసింది. ఇది 2021 ఆగస్టు 4న సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ అయిన స్క్రిప్ట్ కాపీ అని విమల్ కోర్టుకు తెలిపారు.
అయితే, ఆగస్టు 8, 2022న, నానితో కలిసి పనిచేయాలనే ఉద్దేశ్యంతో తన స్క్రిప్ట్ యొక్క సారాంశాన్ని ఆయనకు సమర్పించానని.. నాని నుండి ఎటువంటి స్పందన రాలేదని చెప్పుకొచ్చారు. ఇక హిట్ 3 థియేటర్స్లో చూశాక.. తన కథనే చిన్న మార్పులతో తీశారని తెలిసి షాక్ అయినట్లు పిటిషన్లో వెల్లడించింది.
HIT 3 Copyright Case Update:
— Sonia Vimal (@NameisSoni) June 21, 2025
Madras HC has asked the #HIT3 team and Netflix to respond by July 7.
The next hearing is set. #Agent11VsHIT3 #CopyrightBattle pic.twitter.com/9juxXKTsA6
తన టాలెంట్ను ఉల్లంఘించకుండా ఉండమని.. నాని మరియు అతని టీమ్కు గతంలో లీగల్ నోటీసు పంపినా స్పందన లేదు. దాంతో సౌత్ ఇండియా రైటర్స్ అసోసియేషన్కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోలేదని విమల్ ఆరోపించారు. హిట్ 3 మేకర్స్ కలిగించిన ఆర్థిక నష్టానికి బదులుగా.. మూవీ లాభాల్లో 20 శాతం నష్టపరిహారం చెల్లించాలని విమల్ డిమాండ్ చేసింది.
విమల్ ఆరోపణలపై స్పందించడానికి మద్రాస్ హైకోర్టు.. HIT 3 బృందానికి జూలై 7 వరకు గడువు ఇచ్చింది. అప్పటిలోపు ఈ ఆరోపణలపై నాని, దర్శకుడు శైలేష్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఇకపోతే, దాదాపు రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.110 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.