Kannappa: ‘కన్నప్ప’ ఈవెంట్కు ప్రభాస్!.. శివయ్యా.. రుద్రని పంపిస్తున్నాడా? క్లారిటీ ఇదే..

Kannappa:  ‘కన్నప్ప’ ఈవెంట్కు ప్రభాస్!.. శివయ్యా.. రుద్రని పంపిస్తున్నాడా? క్లారిటీ ఇదే..

మంచు విష్ణు నటించిన లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ మూవీ ‘కన్నప్ప’. మరో ఆరు రోజుల్లో (జూన్27న) కన్నప్ప ఆగమనం ఉండబోతుంది. ఈ సందర్భంగా కన్నప్ప మేకర్స్.. ప్రమోషన్స్లో వేగం పెంచారు. ఈ క్రమంలో నేడు (జూన్21న) కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌ JRC కన్వెన్షన్లో సాయంత్రం 5 గంటలకు కన్నప్ప ఈవెంట్ మొదలవ్వనుంది. అయితే, ఇప్పుడు అందరిలో ఒక్కే ఒక్క డౌట్? ఈవెంట్ కి ప్రభాస్ హాజరవుతాడా? లేదా?.. ఇపుడిదే పెద్ద ప్రశ్నగా మారింది. ప్రభాస్ కూడా ఈ వేడుకకు హాజరవుతారని బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే, ఇప్పటివరకు ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ప్రభాస్ హాజరయితే మాత్రం.. కన్నప్ప నేషనల్ కాదు.. ఇంటెర్నేషనల్ వైడ్గా ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, కన్నప్ప మూవీ చూడటానికి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేది ప్రభాస్‌ ఒక్కరే!

ఈ మాట ఇండస్ట్రీలో స్పష్టంగా విన్పిస్తుంది కూడా. అంతేందుకు సినిమాహీరో విష్ణు మదిలో మెదిలే.. మొదటి ఆలోచన కూడా ఇదే! మరి ఆ శివయ్య.. రుద్రుడ్ని పంపిస్తాడా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

ఇకపోతే, ఈ ఈవెంట్‌కి టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరవ్వనున్నారు. అందులో మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.

కన్నప్ప మూవీలో రుద్ర అనే సాధువు పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. టీజర్, ట్రైలర్ విజువల్స్ లో ప్రభాస్ పెర్ఫార్మన్స్ అంచనాలు పెంచింది. ఇందులో ప్రభాస్ స్క్రీన్‍టైమ్ సుమారు 30 నిమిషాలు ఉండనుంది. మహాశివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిదేవిగా కాజల్ అగర్వాల్, శివుడి పరమభక్తుడిగా విష్ణు నటించారు.