11వ ర్యాంక్ సాధించిన మద్రాస్ మెడికల్ కాలేజీ

11వ ర్యాంక్ సాధించిన మద్రాస్ మెడికల్ కాలేజీ

చెన్నై : తమిళనాడులో ప్రముఖ మద్రాస్ మెడికల్ కాలేజీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ 2022-2023 సంవత్సరానికి నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) మెడికల్ విభాగంలో 11వ ర్యాంక్‌ను సాధించాయి. ర్యాంకింగ్స్‌ను భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం (జూన్ 4న) ప్రకటించింది.

మద్రాస్ మెడికల్ కాలేజ్ గత మూడు సార్లు వరుసగా అంటే2021లో 16ర్యాంక్ , 2022లో 12వ ర్యాంక్, తాజాగా 2023లో 11వ ర్యాంక్‌ సాధించింది. దేశంలోని పలు విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలను బట్టి ర్యాంకింగ్ ఇస్తుటారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ ఆసుపత్రి దేశవ్యాప్తంగా రాణించి టాప్ ర్యాంకింగ్స్‌ను అందుకోవడం విశేషం.