ఐటీఐ కాలేజ్ స్టూడెంట్ బట్టలు విప్పించి ర్యాగింగ్.. ముగ్గురిపై పోలీస్ కేసు..

 ఐటీఐ కాలేజ్ స్టూడెంట్ బట్టలు విప్పించి ర్యాగింగ్.. ముగ్గురిపై పోలీస్ కేసు..

కొద్దిరోజులుగా  ర్యాగింగ్ ఘటనలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. మొన్న హైద్రాబాద్లో  ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థి బలి అవగా.. నిన్న తమిళనాడులో మరో ర్యాగింగ్ కేసు బయటికొచ్చింది. మధురైలోని ఒక ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు వివస్త్రను చేసి అవమానించిన దిగ్భ్రాంతికరమైన ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉసిలంపట్టి సమీపంలోని ఐటిఐ కాలేజీ హాస్టల్‌లో సెప్టెంబర్ 18న జరిగిన ఈ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని గురిచేసింది,  దింతో ముగ్గురు విద్యార్థులపై పోలీసు కేసు కూడా నమోదైంది. 

ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో బాధితుడిని తోటి విద్యార్థులు తీవ్ర అవమానానికి గురిచేస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు 70 మంది విద్యార్థులు ఉన్న ఈ హాస్టల్ నుండి వెలువడిన వీడియోలో బాధితుడి బట్టలు బలవంతంగా తొలగించి,  తీవ్ర అవమానానికి  గురిచేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. 

బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురై పోలీసులు కేసు నమోదు చేసుకొని, ఘటనకు సంబంధించి ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేసారు, అలాగే హాస్టల్ వార్డెన్ బాలమురుగన్‌ను సస్పెండ్ చేశారు.

ALSO READ : రేబీస్ చాలా డేంజర్..అశ్రద్ధ చేస్తే ప్రాణాలు పోతాయ్..

హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో 22 ఏళ్ల రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి  హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. వివరాల ప్రకారం సాయి తేజ అనే విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్, వేధింపులకు గురిచేస్తూ, బార్‌కు తీసుకెళ్లి మద్యం సేవించమని అలాగే దాదాపు రూ.10 వేల బిల్లు కట్టమని బలవంతం చేశారని తెలుస్తోంది. దింతో  తీవ్ర ఒత్తిడితోనే ఆ విద్యార్థి ఉరి వేసుకున్నడని పాలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు.