రేబీస్ చాలా డేంజర్..అశ్రద్ధ చేస్తే ప్రాణాలు పోతాయ్..పెంపుడు కుక్క కరిచి పోలీస్ మృతి

రేబీస్ చాలా డేంజర్..అశ్రద్ధ చేస్తే ప్రాణాలు పోతాయ్..పెంపుడు కుక్క కరిచి పోలీస్ మృతి

ఇటీవల కాలంలో హాట్ టాపిక్.. వీధికుక్కల దాడి..వీధికుక్కల దాడులు తీవ్రతరం కావడంతో ఈ సమస్యను ఎలా డీల్ చేయాలని అని ప్రభుత్వాలు, అధికారులు తలలు పట్టుకుంటున్న విషయం తెలిసిందే..ఈవిషయం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లింది. దాడుల్లో తీవ్రగాయాలతో కొందరు మరణిస్తే.. మరోవైపు కుక్కకాటుతో రేబిస్​ వ్యాధి సోకి మరణాలు కూడా పెరుగుతున్నాయి. సొంత పెంపుడు కుక్క కరిచి ఓ పోలీసు అధికారి మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది.  

అహ్మదాబాద్‌కు చెందిన వనరాజ్ మంజరియాను అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్ తన పెంపుడు కుక్క గీకడంతో రేబిస్ బారిన పడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అహ్మదాబాద్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు పోలీస్​ ఇన్ స్పెక్టర్​గా పనిచేస్తున్న మంజరియా.. కుక్క కరిచిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కుక్క గీకింది కదా అని నిర్లక్ష్యం చేశాడు.. దీంతో అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చేరాడు.. టెస్టులు చేసిన డాక్టర్లు.. మంజరియాకు రేబిస్​ సోకిందని చెప్పారు. అయితే రేబిస్​ ముదరడంతో చికిత్స పొందుతూ అతను చనిపోయినట్లు నిర్ధారించారు. 

చాలామంది కుక్క గీకితే రేబిస్​ వ్యాధి సోకదు అని అంటుంటున్నారు.. కుక్క కరిచినా, గీకినా రేబిస్​ సోకుతుందని, నిర్లక్ష్యం చేస్తే మరణం తప్పదని అంటున్నారు డాక్టర్లు. 

►ALSO READ | అలా ఎలా ఎక్కావురా.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్న ఆఫ్ఘన్ బాలుడు.. 2 గంటలు గాల్లోనే..