రెండుసార్లు మంత్రిగా ప్రమాణం

రెండుసార్లు మంత్రిగా ప్రమాణం
  • మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో విచిత్ర ఘటన

భోపాల్: మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఎమ్మెల్యే15 నిమిషాల వ్యవధిలో  రెండుసార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాంనివాస్ రావత్ ఇటీవల అధికార బీజేపీలో చేరారు. సీఎం మోహన్ యాదవ్ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయనతో గవర్నర్ మంగుభాయ్ సీ పటేల్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.

ఆ సమయంలో రావత్ ‘రాజ్య మంత్రి(రాష్ట్ర మంత్రి)’కి బదులు ‘రాజ్యా కే మంత్రి(సహాయ మంత్రి)’అని పొరపాటున చదివారు. పొరపాటును గుర్తించిన అధికారులు  రావత్​తో మరోసారి ప్రమాణం చేయించాలని నిర్ణయించారు. అలా.. మొదటి ప్రమాణాన్ని రద్దు చేసి 15 నిమిషాల తర్వాత  మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించారు.

కాగా.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న రాంనివాస్ రావత్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రావత్ ఇంకా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా రాజీనామా చేయలేదని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై రావత్ స్పందించారు. పొరపాటున రెండుసార్లు ప్రమాణం చేశానని, అరగంటలో రెండుసార్లు ప్రమాణం చేసిన మొదటి మంత్రిని తానేనని గర్వంగా చెప్పుకున్నారు.