ఓటీటీలోనే విడుదలకానున్న మ్యాస్ట్రో

V6 Velugu Posted on Jul 21, 2021

ఓవైపు ఈ నెల 23 నుండి థియేటర్స్ ఓపెన్ చేస్తామంటున్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్. మరోవైపు ‘నారప్ప’ సినిమా ఓటీటీ ద్వారా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పటికీ థియేటరా ఓటీటీనా అనే డైలమా ఇండస్ట్రీలో కనిపిస్తోంది. ‘టక్ జగదీష్’ లాంటి కొన్ని సినిమాలు థియేటర్స్ వైపు చూస్తుంటే, మరికొన్ని చిత్రాలు మాత్రం ఓటీటీకే ఓటు వేస్తున్నాయి. ఫస్ట్ లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ తర్వాత నెల రోజుల గ్యాప్‌‌‌‌‌‌‌‌తో తన రెండు సినిమాలను (చెక్, రంగ్ దే) థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో చూపించిన నితిన్, ఈసారి మాత్రం ఓటీటీకే మొగ్గు చూపాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మాస్ట్రో’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యి రిలీజ్‌‌‌‌‌‌‌‌కి రెడీగా ఉంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ప్రమోషనల్ సాంగ్ కూడా షూట్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. హాట్ స్టార్ ద్వారా దీనిని విడుదల చేయబోతున్నారని తెలిసింది. అఫీషియల్‌‌‌‌‌‌‌‌గా అనౌన్స్ చేయలేదు కానీ డిజిటల్ రిలీజ్ డీల్ ఇప్పటికే పూర్తయినట్టు తేలింది. ఇండిపెండెన్స్‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా ఆగస్టు 15 నుండి ఈ సినిమాని స్ట్రీమ్ చేయబోతున్నారట. అతి త్వరలో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. నితిన్ సొంత బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన తండ్రి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సిస్టర్ నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ ‘అంధాధున్’కి రీమేక్‌‌‌‌‌‌‌‌. నితిన్‌‌‌‌‌‌‌‌కి జంటగా నభా నటేష్ నటించింది. హిందీలో టబు చేసిన నెగిటివ్ రోల్‌‌‌‌‌‌‌‌ని తమన్నా పోషించింది. జిషు సేన్‌‌‌‌‌‌‌‌గుప్తా, నరేష్, శ్రీముఖి, అనన్య, హర్షవర్థన్, శ్రీనివాసరెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Tagged lockdown, Movies, coronavirus, theaters, OTT, tollywood, Nabha Natesh, nithin, merlapaka gandhi, Maestro, Maestro movie

Latest Videos

Subscribe Now

More News