
- నాలుగు రోజుల కింద హాస్టల్ లో ఆమె రాసిన లెటర్ లభ్యం
- తండ్రికి ఫోన్ లో సమాచారమిచ్చిన కాలేజ్ ప్రిన్సిపాల్
- హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకోగా..
- యువకుడి వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని తల్లి
మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు: గురుకుల ఇంటర్విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌కు చెందిన నగేశ్, పద్మమ్మ దంపతుల కుమార్తె ప్రియాంక(16), మహబూబ్ నగర్ జిల్లాలోని రామిరెడ్డిగూడెం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్‌కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది.
ఈనెల 6న విద్యార్థిని హాస్టల్లో అనారోగ్యం బారిన పడగా సిబ్బంది వెళ్లి సపర్యలు చేశారు. అనంతరం విద్యార్థిని లగేజీ సర్దుతుండగా సూసైడ్ లెటర్ కనిపించింది. ‘ మీరు నాపైన ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. నేను చదువలేకపోతున్నా. నేను ఇంటికి వస్తా. తీసుకెళ్లండి. లేకుంటే చనిపోతా..’’ అని అందులో రాసి ఉంది. వెంటనే లెటర్‌ను కాలేజ్ప్రిన్సిపాల్కు ఇవ్వగా.. విద్యార్థిని తండ్రికి ఫోన్‌చేసి విషయం చెప్పారు.
తన పెద్ద కూతురు అనారోగ్యంతో ఉందని, ఇప్పుడు హాస్టల్‌కు రాలేనని సమాధానం ఇచ్చాడు. అనంతరం ప్రియాంకతో తండ్రి మాట్లాడుతూ మందలించాడు. కాగా.. సోమవారం ఉదయం ప్రియాంక క్లాస్‌కు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్కూల్ సిబ్బంది బాత్రూమ్కి వెళ్లి చూడగా వెంటిలేటర్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, అంబులెన్స్ లో మహబూబ్నగర్ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. సమాచారం తెలియడంతో మహబూబ్నగర్కలెక్టర్విజయేందిర బోయి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థిని డెడ్ బాడీని పరిశీలించా రు. ఘటనపై ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకుని, అనంతరం విద్యార్థిని తండ్రిని పరామర్శించారు.
యువకుడి వేధింపులే కారణమా?
తన కూతురు మృతికి ఖాదర్ అనే యువకుడు కారణమని విద్యార్థిని తల్లి పద్మమ్మ సోమవారం సాయంత్రం మహబూబ్నగర్రూరల్పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడు తన కుమార్తెకు లవ్ లెటర్ఇచ్చి తరచూ వేధింపులకు గురి చేసేవాడని, భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో తెలపగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ఎస్‌ఐ వినోద్ కుమార్ తెలిపారు.