వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి : కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్

 వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి : కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టాలని మహబూబాబాద్​ కలెక్టర్​ అద్వైత్​కుమార్​ సింగ్​ అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ గత వేసవికాలంలో జరిగిన పరిస్థితుల ఆధారంగా వచ్చే వేసవికాలం నేపథ్యంలో జిల్లాలోని వివిధ మండలాలు, మున్సిపల్  పాలిటీల పరిధిలో ప్రజలకు తాగునీరు అందించడంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 1522  ఓహెచ్ఆర్ఎస్, 1002 ఓపెన్ వెల్స్, 2093 హ్యాండ్ పంపులు, ఇతర వాటర్ సోర్సులను నిరంతరం గమనిస్తూ, పరిరక్షిస్తూ ఉండాలన్నారు. 

తాగునీరుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1916 లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో పురుషోత్తం, డీఆర్డీఏ పీడీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్​ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్​ తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు స్విఫ్ యాక్టివిటీస్ ద్వారా విస్తృత ప్రచారం చేసి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 23, 25 తేదీల్లో ఓటరు ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో రాజేశ్వర్, వెల్ఫేర్ అధికారిని సబిత, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదర్, కలెక్టరేట్ ఏవో పవన్ కుమార్, పర్యవేక్షకులు రాజేశ్​తదితరులు పాల్గొన్నారు.