మహబూబాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పై కఠిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

మహబూబాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పై కఠిన చర్యలు తీసుకోవాలి :  కలెక్టర్ స్నేహ శబరీశ్

మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని మహబూబాబాద్​ కలెక్టర్​ కలెక్టర్​ స్నేహ శబరీశ్​ అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇసుకను అందించాలని అన్నారు. ఇసుక రీచ్ లు కలిగిన ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

జిల్లాస్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ కమిటీలో ఆర్డీవో, ఏడీ మైనింగ్, పోలీస్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, రవాణా శాఖ అధికారి ఉంటారని తెలిపారు. అలాగే, జిల్లాలో అక్రమ స్కానింగ్ లు, అబార్షన్లు జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని, మాతా, శిశు మరణాలను జరగకుండా చూడాలని, హాస్పటల్  తనిఖీ లు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో ఎస్పీ శబరీశ్, అడిషనల్​ కలెక్టర్ అనిల్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.