మరిపెడ,(చిన్నగూడూరు), వెలుగు: మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్ చిన్నగూడూరు మండల కేంద్రంలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా జడ్పీ హెచ్‌ఎస్‌లో జరుగుతున్న టెన్త్ ఎగ్జామ్స్‌ను తనిఖీ చేశారు.
పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
