మున్సిపాలిటీల అభివృద్ధికి ముందుకు సాగాలి : మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్

మున్సిపాలిటీల అభివృద్ధికి ముందుకు సాగాలి : మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్

మహబూబాబాద్, వెలుగు: పట్టణాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని మహబూబాబాద్​ కలెక్టర్ స్నేహ శబరీశ్ కోరారు. మంగళవారం మహబూబాబాద్ మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్​లో ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహబూబాబాద్​ మున్సిపాలిటీ 2026_-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.92.66 కోట్ల బడ్జెట్ ను ఆమోదించారు. 

సమావేశంలో మున్సిపల్​ చైర్ పర్సన్ జ్యోతి రమేశ్, వైస్ చైర్​పర్సన్ సూర్ణపు సోమయ్య, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలో వెంకటేశ్వర బజార్ పద్మశాలీ కమ్యూనిటీ హాల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. శిబిరంలో రోగులకు అందుతున్న సేవలపై డాక్టర్ మౌనికను అడిగి తెలుసుకున్నారు.