పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మురళీ నాయక్

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మురళీ నాయక్

మహబూబాబాద్, వెలుగు: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్​లో 92 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. సన్న బియ్యం పథకం ద్వారా ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు సంబంధించి జిల్లాలోని 558  రేషన్ షాపుల ద్వారా 2,77,973 మంది కార్డుదారులకు, 15,734,361 మెట్రిక్ టన్నులు ఈ నెలలోనే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ, పట్టణ స్థాయిలలో గ్రామసభలు నిర్వహించి రైతుల సంక్షేమం పేదలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. 

అనంతరం కలెక్టర్ స్నేహ శబరీశ్​ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ  అందింస్తున్నామని, సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో మహబూబాబాద్ ఆర్డీవో కృష్ణవేణి, మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ను కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు, మార్కెటింగ్, వ్యవసాయ, సంబంధిత అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 1.30లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు జరిగిందని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు చేయాలని సూచించారు.