నవంబర్ 17 వరకు ఎంజాయ్ ​చేయండి : భూపేశ్ బాఘెల్

నవంబర్  17 వరకు ఎంజాయ్ ​చేయండి : భూపేశ్ బాఘెల్
  • బీజేపీపై చత్తీస్​గఢ్ సీఎం బాఘెల్​ఫైర్

రాయ్​పూర్ :  చత్తీస్​గఢ్​లో అసెంబ్లీ ఎన్నికల వేళ మహదేవ్​ బెట్టింగ్​ యాప్ ఇష్యూ కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంలో బీజేపీ చేసిన ఆరోపణలను ​సీఎం భూపేశ్ బాఘెల్ తిప్పికొట్టారు. బెట్టింగ్ యాప్​ను చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎలక్షన్​ కమిషన్​ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'బీజేపీ ఈ నెల 17 వరకు ఎంజాయ్ చేస్తుంది. అయితే, ఈ ఆరోపణలు ఎలక్షన్​పై ఎలాంటి ఎఫెక్ట్​ చూపవు. ఇలాంటి ప్రయత్నాలను ఎన్నికల సంఘం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?  దీనిపై మేము ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నంపై ఎంక్వైరీ జరగాలి’’ అని బాఘెల్ అన్నారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే మహాదేవ్  బెట్టింగ్ యాప్​పై కేంద్రం నిషేధం విధించడంలేదని బాఘెల్  ఆరోపించారు. యాప్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగస్టులోనే  తాము కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. మరోవైపు, దుబాయ్​లో ఉన్న యాప్ ఓనర్ శుభమ్ సోని మాట్లాడిన వీడియో ఒకటి ఆదివారం వైరల్​గా మారింది. సీఎం బాఘెల్​సలహా మేరకే తాను దుబాయ్​కి మకాం మార్చానని సోని పేర్కొన్నారు. సీఎంకు ఇప్పటివరకు రూ.508 కోట్లు చెల్లించానని అందులో చెప్పాడు. బెట్టింగ్ యాప్​కు అసలైన యజమాని బాఘెలేనని పేర్కొన్నాడు.