బీసీల హక్కుల కోసం ఆగస్టు 2న మహాధర్నా

బీసీల హక్కుల కోసం ఆగస్టు 2న  మహాధర్నా
  • బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం, రాజకీయ వాటాలను తేల్చుకునేందుకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన కుట్రలు, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న బీసీ వ్యతిరేక కుట్రలను ప్రజల ముందు బయటపెట్టబోతున్నామని చెప్పారు. 

బీజేపీ స్టేట్ ఆఫీసులో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎనిమిది జిల్లాల ముఖ్యనేతలు, యువమోర్చా ఆఫీస్ బేరర్ల సమావేశానికి కాసం హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని వాగ్దానం చేశామని, మరి బీసీని సీఎం చేసే దమ్ము కాంగ్రెస్​కు ఉందా అని ప్రశ్నించారు. ఇటీవలి కేబినెట్​మీటింగ్ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు తన పరిధిలో లేవని సీఎం చెప్పి, నిస్సిగ్గుగా ఢిల్లీకి బయలుదేరారని విమర్శించారు.