మోపాల్, వెలుగు: మోపాల్ మండలం కంజరలో ఆదివారం మహాలక్ష్మి పండగను ఘనంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకొని గ్రామంలో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామ శివారులోని మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.