ఉద్దవ్ వర్గానికి షాక్: షిండే సేననే నిజమైన శివసేన: మహారాష్ట్ర స్పీకర్

ఉద్దవ్ వర్గానికి షాక్: షిండే సేననే నిజమైన శివసేన: మహారాష్ట్ర స్పీకర్

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కు షాక్ తగిలింది. షెండే వర్గమే అసలైన శివసేన అని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ చెల్లదని అన్నారు. ఇదే విషయాన్ని ఈసీ కూడా చెప్పిందన్నారు. షిండే వర్గానికి మెజార్టీ ఎమ్మెల్యేలున్నారు. షిండే ను పార్టీ నుంచి తొలగించే అధికారం ఉద్దశ్ ఠాక్రే కు లేదని అన్నారు. ఇరు వర్గాల ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన రెండు శివసేన వర్గాల క్రాస్ పిటిషన్ పై స్పీకర్ రాహుల్ నర్వేకర్ స్పందిస్తూ.. షిండే సేననే నిజమైన శివసేన ఉత్వర్తులు జారీ చేశారు. 

2022 జూన్ లో షిండే , పలువురు ఎమ్మెల్యేలు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. ఇది శివసేనలో చీలికకు దారితీసింది. NCP,కాంగ్రెస్ లతో కలిసి ఉన్న మహా వికాస్ అఘాడి పతనానికి దారితీసింది. పార్టీ చీలిక క్రమంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రెండు శివసేన వర్గాలు క్రాస్ పిటిషన్ వేశాయి. ఈక్రమంలో బుధవారం (జనవరి 10) అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కీలక తీర్పును చెప్పారు. అసలైన శివసేన.. షిండే వర్గమేనని అన్నారు. దీంతో షిండే వర్గం బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.