dubious passports Scam: ముంబైలో పాస్పోర్టు స్కాం..32 మంది అరెస్ట్

dubious passports Scam: ముంబైలో పాస్పోర్టు స్కాం..32 మంది అరెస్ట్

ముంబై: లంచం తీసుకుని పాస్ పోర్టులు జారీ చేస్తున్న 32 మందిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయాల్లో శనివారం (జూన్ 29) సోదాలు చేసిన సీబీఐ అధికారులు..పాస్ పోర్టు అధికారులతో సహా 32 మందిపై 12 కేసులను నమోదు చేసింది. అవినీతి, అక్రమ పాస్ పోర్టుల జారీ ఆరోపణలు రావడంతో ముంబై, నాసిక్ సహా మహారాష్ట్రలోని 33 ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు సీబీఐ అధికారులు . లంచం తీసుకుని పాస్ పోర్టులు జారీ చేస్తున్న పాసు పోర్టు అధికారులతో సహా 32 మంది అధికారులపై కేసులు నమోదు చేసింది. 

పాస్ పోర్టు జారీపై ఫిర్యాదులు రావడంతో నాసిక్ తో పాటు మలాడ్, లోక్ పరేల్ లోని పాస్ పోర్టు సేవా కేంద్రంలో తనిఖీలు నిర్వహించింది. 14 మంది పాస్ పోర్టు డిపార్ట్  మెంట్ అధికారులపై ముంబై సీబీఐ అధికారులు బుక్ చేశారు. మరోవైపు నాసిక్ తో పాటు పలు ప్రాంతాల్లో దాడులు చేసిన సీబీఐ 12 కేసులు నమోదు చేసింది.  అరెస్ట్ అయిన వారిలో 14 మంది పాస్ పోర్టు అసిస్టెంట్లు, పీఎస్ కేలలలో  సీనియర్ పాస్ పోర్టు అసిస్టెంట్లు, మిగిలిన 18 మంది ఫెసిలిటేటర్లు, ఏజెంట్లు, టౌట్ లు ఉన్నారు. వీరంతా కలిసి అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది.