రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ

రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ

మహారాష్ట్ర రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం ఉద్దవ్ ఠాక్రే  ప్రకటించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు  అసెంబ్లీలో ప్రకటించారు.   నగదు నేరుగా బ్యాంకులో జమ చేస్తామన్నారు. మహాత్మ జ్యోతిరావ్ పూలే పేరుతో ఈ రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. 2019 సెప్టెంబర్ 30 వరకు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందన్నారు.  2020 మార్చి నుంచి ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. మరో  వైపు ప్రతిపక్షాలు రుణమాఫీపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.  ఎలాంటి షరతులు  లేకుండా పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఇపుడు కండీషన్స్ పెట్టడం సరైందికాదన్నారు. రుణమాఫీ ప్రకటనకు నిరసనగా బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.