ముంబై అండర్ గ్రౌండ్లో భారీ టన్నెల్ నెట్వర్క్ : సీఎం దేవేంద్ర

ముంబై అండర్ గ్రౌండ్లో భారీ టన్నెల్ నెట్వర్క్ : సీఎం దేవేంద్ర
  • మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మౌలిక సదుపాయాలను మరింతగా అభివృద్ధి చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించడానికి అండర్ గ్రౌండ్ లో  భారీ టన్నెల్స్ నెట్‌వర్క్‌ ను నిర్మిస్తామని తెలిపారు. 

సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. “ముంబైలో రద్దీని పూర్తిగా తగ్గించడానికి అండర్ గ్రౌండ్ లో టన్నెల్ నెట్ వర్క్ పాతాళ్ లోక్ ను సృష్టించనున్నాం. ప్రస్తుత రోడ్లకు సమాంతరంగా దీన్ని నిర్మించనున్నాం. మెట్రోకారిడార్లను కూడా అందుబాటులోకి తెస్తాం. బోరివలి, గోరేగావ్ మధ్య రోడ్డు,  వర్లి– -శివడి కనెక్టర్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. దీన్ని వల్ల రద్దీ తగ్గి వాహనాలు సజావుగా రాకపోకలు సాగించగలవు. బాంద్రా నుంచి బాంద్రా– కుర్లా కాంప్లెక్స్ వరకు ప్రతిపాదిత టన్నెల్ వల్ల ఎయిర్ పోర్టుకు వేగంగా చేరుకోవచ్చు” అని పేర్కొన్నారు.